ప్రముఖ కాలభైరవుని ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

కాలభైరవుడంటే.. శివుని స్వరూపమే. అలాంటి కాలభైరవుని ప్రముఖ ఆలయాలు మన దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఉన్నాయి. అవెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

1.వారణాసి (ఉత్తరప్రదేశ్) :

కాలభైరవునికి బ్రహ్మహత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈక్షేత్రం ప్రసిద్దిచెందినది.అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.

2.ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌లో ఇండోర్) :

గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము.

3.దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :

ప్రాచీనాలయం ధ్వంసంకాగా భైరవమూర్తులు ఒక చిన్నపాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పైకప్పుగా పెంకులతో కన్పిస్తుంది. ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి.

1. వనభైరవుడు!
2. జటాభైరవుడు!
3. గధాభైరవుడు!
4. తాండవభైరవుడు!

4.తేజ్ పూర్ (అస్సాంలో గౌహతి) :

ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామిపేరు’మహాభైరవుడు.’లింగరూపంలో పూజ లందు కుంటాడు.సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈలింగాన్ని ప్రతిష్ఠించి,పూజించినట్లు స్థలపురాణం. నాగులు ఈలింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్ప స్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారం ఉన్నాయి.

Share this post with your friends