
ఈ పండుగను హిందూ మతం ప్రకారం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు జరుపుకుంటారని ముందుగానే తెలుసుకున్నాం కదా. ఇంతకీ ఈ ఏడాది పౌర్ణమికి ముందు శుక్రవారం ఏ తేదీన రానుందో తెలుసుకుందాం. అలాగే పూజకు శుభ ముహూర్తం ఎప్పుడో కూడా తెలుసుకుందాం. ఆగస్ట్ 8వ తేదీన మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది. ఇక సింహ లగ్న పూజ ముహూర్తం వచ్చేసి ఉదయం 06:29 – ఉదయం 08:46.. వృశ్చిక లగ్న పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – మధ్యాహ్నం 01:22 – మధ్యాహ్నం 03:41.. కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) – రాత్రి 07:27 – రాత్రి 08:54 వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:55 – 01:50.
మనం లక్ష్మీ దేవిని పూజించడానికి ఉత్తమ సమయం వచ్చేసి స్థిరమైన లగ్న సమయం.. ఈ సమయంలో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే దీర్ఘకాలిక శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతం చేసుకునే సమయంలో తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది వరుస ముడుల మధ్య పంచ పుష్పాలను కట్టాలి. ఆ తరువాత దానికి పసుపు పూసి తోరణంగా కట్టాలి. వ్రత సమయంలో తోరణాన్ని అమ్మవారి ముందు పెట్టి తోరగ్రంథి పూజ చేయాల్సి ఉంటుంది. దీనిని పూజ ముగింపునకు చేరుకున్నాక కుడి చేతికి రక్షణగా కట్టుకోవాల్సి ఉంటుంది.
