హనుమద్దీక్షను ఎప్పుడు స్వీకరించాలి?

సాధారణంగా చైత్రపూర్ణిమకు ముందుగా హనుమద్దీక్షలు తీసుకుంటారు. వైశాఖం ఎండాకాలం కనుక, దీక్షలకు అనుకూలమైన కాదు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే. తిరుమల క్షేత్రంలో అంజనాద్రిపై హనుమంతుని జన్మస్థలమైన జాబాలి తీర్థం, తెలంగాణ కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి 15 కి.మీ.లు దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం హనుమద్దీక్షా విరమణకు ముఖ్యమైన క్షేత్రాలు.

Share this post with your friends