శ్రీనివాసుడికి పిండి దీపం ఎప్పుడు వెలిగించాలి?

పెరటాసి మాసం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసమని తెలుసుకున్నాం. మరి పెరటాసి మాసంలో శ్రీనివాసుడిని ఎలా పూజిస్తే ఫలితం బాగుంటుందో తెలుసుకుందాం. వాస్తవానికి శ్రీ వేంకటేశ్వరునికి శనివారాలు చాలా ప్రత్యేకమని అందరికీ తెలిసిందే. ఇక పెరటాసి మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి మరింత ప్రీతికరమైనవని అంటారు. ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనది. ఈ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు.

అయితే అన్ని వారాలు వెలిగించలేని వారు మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసుడికి పిండి దీపం వెలిగిస్తారు. ఇక పిండి దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. శ్రీనివాసుడికి వెలిగించే పిండి దీపాన్ని అన్యమనస్కంగా వెలిగించకూడదు. పూర్తి భక్తతో వెలిగించాలి. పిండి దీపాన్ని తయారు చేయడం కోసం ముందుగా కొన్ని బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత నీళ్లన్నీ వడగట్టి బియ్యాన్ని నీడలో ఆరబెట్టి కాస్త ఆరాక పిండి పట్టుకోవాలి. ఆ తరువాత పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. అయితే ఇదంతా మడితోనే చేయాల్సి ఉంటుంది.

Share this post with your friends