రుద్రాభిషేకం ఎప్పుడు చేయాలి?

ఇతర దేవతల కంటే శివయ్యను ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించినా చాలు పొంగిపోయి వరాలిచ్చేస్తాడు. అందుకే శివయ్యను భోళా శంకరుడని అంటారు. ఇక శివయ్య ఆశీస్సులు మనపై మెండుగా ఉండాలంటే రుద్రాభిషేకం చేయాలి. మరి ఈ రుద్రాభిషేకం ఎప్పుడు పడితే అప్పుడు చేయవచ్చా? అంటే చేయవచ్చు కానీ కొన్ని ప్రత్యేక తిథుల్లో ఈ రుద్రాభిషేకం చేస్తే ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రదోషం, మాస శివరాత్రి, మహా శివరాత్రి, శ్రావణ, కార్తీక మసాల సమయంలో శివయ్య అనుగ్రహం కోసం రుద్రాభిషేకం చేస్తే ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి.

ఈ నేపథ్యంలో శ్రావణ మాసం మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.. ఇదే రోజున రుద్రాభిషేకం చేసి రావణుడిపై శ్రీరామచంద్రుడు విజయం సాధించాడట. రుద్రాభిషేకం నిర్వహిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోవడంతో పాటు కోరుకున్నది నెరవేరుతుందట. మనకు ఉన్న అన్ని బాధల నుంచి.. ఇబ్బందుల నుంచి కూడా రుద్రాభిషేకం నిర్వహిస్తే ఉపశమనం లభిస్తుందట. రుద్రాభిషేకం సమయంలో “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇది శివుని ఉగ్రరూపమైన రుద్రుడిని స్తుతించే మంత్రం.

Share this post with your friends