ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయి. హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి సొంత ప్రాదాన్యత ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ఇది చేస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారు విష్ణులోకంలో స్థానం పొందుతాడట. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ప్రధాన ద్వారం తెరిచి ఉంటుందని కూడా చెబుతారు. వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు జరుపుకోనున్నాం. అంటే ఈ ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి రానుంది.
వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు ఉండాలో చూద్దాం. 10వ తేదీ నాడు ఉపవాసం ప్రారంభించి మరుసటి రోజు విరమించాల్సి ఉంటుంది. ద్వాదశి నాడు జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే విరమించాలి. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, పౌష పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతంతో పాటు ఉపవాసం ఉండాలి. అలాగే విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయట. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం.