వామన జయంతి ఎప్పుడు?

హిందూమతంలో వామనుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీ మహా విష్ణువే వామనావతారం దాల్చడంతో ఆయనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉంటారు. త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా మొత్తంగా పది అవతారాలను దాల్చాడు. వాటిల్లో రామ, కృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి కాగా.. ఆ తరువాత వామనావతారం కూడా ప్రఖ్యాతి గాంచింది. విష్ణుమూర్తి ఐదవ రూపమే వామనావతారం. కాబట్టి మనం వామన జయంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ఆ రోజున ఉపవాసం ఆచరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

వామన జయంతి రోజున మనం వామనుడిని మనస్పూర్తిగా ఆరాధించి, ఉపవాసం ఆచరిస్తే భక్తులకు శుభ ఫలితం దక్కుతుందట. భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ద్వాదశి రోజున వామన జయంతి జరుపుకుంటారు. అంటే ఈ ఏడాదిలో ఈ నెల 15వ తేదీన మనం వామన జయంతిని జరుపుకోనున్నాం. ద్వాదశి తిథి సెప్టెంబర్ 14న రాత్రి 8:41 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 15, 2024 సాయంత్రం 6:12 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం 15న వామన జయంతిని జరుపుకోనున్నాం. శ్రవణ నక్షత్రం సెప్టెంబర్ 14న రాత్రి 08:32 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం 06:49 గంటలకు ముగుస్తుంది.

Share this post with your friends