శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఎన్ని విధాలుగా వేద విద్యా బోధ‌న‌ ఉంటుందంటే..

ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నాలుగు ప్రధాన విభాగాల కింద మొత్తం 17 ప్రత్యేక విద్యా శాఖలు నిర్వహించబడుతున్నాయి. వేదాధ్యయనంలో 7 వేదశాఖలు, ఆగమాధ్యయనంలో 5 ఆగమాలు, స్మార్త అధ్యయనంలో 4 విభాగాలు, దివ్యప్రబంధంలో ఆళ్వారుల‌ 4000 పాశురాలు బోధించబడుతున్నాయి. ఈ కోర్సులు దీర్ఘకాలికంగా నిర్వహించబడుతూ విద్యార్థులకు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం మొత్తం 374 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో వేద కోర్సుల్లో 140 మంది, ప్రబంధ-ఆగమ కోర్సుల్లో 177 మంది, స్మార్త కోర్సుల్లో 57 మంది ఉన్నారు. వీరికి బోధన అందించేందుకు 43 మంది పండితులు సేవలందిస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఎన్ని విధాలుగా వేద విద్యా బోధ‌న‌ ఉంటుందంటే..
శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఎన్ని విధాలుగా వేద విద్యా బోధ‌న‌ ఉంటుందంటే..

విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌ :

విద్యార్థుల సంక్షేమానికి టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 540 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉన్న హాస్టల్ సౌకర్యాలు, శుభ్రమైన నివాస వాతావరణం, 24 గంటల నీటి సరఫరా, వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల‌కు పోషకాహారంతో కూడిన భోజనం అందించేందుకు ఉదయం పాలు, ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలు, మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరలు, సాంబారు, రసం, పెరుగు, సాయంత్రం పాలు, రాత్రి భోజనం అందిస్తున్నారు. అదనంగా విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నిత్యావసర వస్తువులు (సబ్బులు, నూనెలు, పేస్ట్ మొదలైనవి) అందించబడుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ కోసం అశ్విని ఆసుపత్రి ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందించబడుతుండగా, అవసరమైతే తిరుప‌తిలోని స్విమ్స్, బ‌ర్డ్‌ ఆసుపత్రుల్లో కూడా ఉచిత చికిత్స అందిస్తున్నారు.

Share this post with your friends