కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలేంటంటే..

తిరుపతి నుంచి 58 కి.మీ.ల. దూరంలో, పుత్తూరు నుంచి 12 కి.మీ.ల దూరంలో కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏకశిలతో నిర్మించారు. ఇది అత్యంత పురాతనమైన ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు కొలువుదీరాడు. ఈ ఆలయం 400 ఏళ్లకు పూర్వం నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ఆలయాన్ని నారాయణవనం పాలకులైన వెంకట రాజ వంశానికి చెందిన రాజు వెంకట పెరుమాళ్ నిర్మించారని ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయం ఐదంతస్థుల రాజ గోపురంతో తూర్పు అభిముఖంగా ఉంటుంది.

కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలేంటంటే..
కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలేంటంటే..

ప్రధాన గర్భాలయంపై ఉన్న రాజగోపురంలో నుంచి మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఆ తరువాత బలిపీఠం, ధ్వజస్థంబము, గరుడాళ్వార్ ఉంటాయి. ఆలయంలో ప్రధానంగా గర్భగుడి ఉంటుంది. అలాగే అంతరాలయం, మహామండపం ఉంటాయి. గర్భాలయంలో వేణువు ధరించిన వేణుగోాలస్వామి రుక్మిణి, సత్యభామ సమేతంగా మనకు దర్శనమిస్తాడు. ఈ విగ్రహాలను తిరుపతి సమీపంలోని నారాయణవనం దేవాలయం నుంచి తీసుకు రావడం జరిగింది. అలాగే ఈ అనేక ఉపాలయాలు ఉన్నాయి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మల ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏటంటే.. శ్రీకృష్ణుని పాదాల చెంత వెన్నకుండ కూడా ఉంటుంది.

Share this post with your friends