స్కంద షష్టి ఎప్పుడు?

హిందూ మతంలో ప్రతి రోజుకూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్కంద షష్టి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే కోరికలన్నీ నెలవేరుతాయని నమ్మకం. జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. అసలు స్కంద షష్టి ఎప్పుడో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జనవరి 04న రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జనవరి 05 రాత్రి 08:15 గంటలకు ముగుస్తుంది.

మనం ఏ పండుగను అయినా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి స్కంద షష్ఠి జనవరి 05వ తేదీ 2025న జరుపుకుంటారు. స్కంద షష్ఠి అనేది కార్తికేయుడికి అంకితం చేయబడింది కాబట్టి హిందువులకు ఇది ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సాధారణంగా కార్తీక మాసంలోని శుక్ల పక్షం షష్టి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున కార్తికేయుడిని పూజించిన భక్తులకు ధైర్యం, తెలివి, విజయం వంటివి లభిస్తాయి. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయట. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందట. అయితే సంతానం కోసం సుబ్రహ్మణ్య షష్టి నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.

Share this post with your friends