సూర్య భగవానుడికి సైతం ఓ రోజు ఉంటుంది. అదే షష్మి. ఈ రోజున సూర్య భగవానుడిని పూజిస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవవంతులవుతారు. అలాగే ఆనందం, ఆదాయం పరంగా కూడా బాగుంటుందట. అంతేకాకుండా సంతానం భాగ్యం లేని వారు సైతం షష్టి రోజున షష్టి వ్రతం ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. మరి షష్టి ఎప్పుడు అంటారా? జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జూన్ 11వ తేదీ మంగళవారం ప్రారంభం కానుంది. మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది.
ఉదయ తిథి ప్రకారం స్కంద షష్టిని ఈ నెల 12వ తేదీన జరుపుకోవాలి. చాలా మంది ప్రతిరోజూ ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తూ ఉంటారు. కానీ షష్టి రోజున ముఖ్యంగా సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుందట. ఈ రోజున శివపార్వతుల తనయుడైన స్కందుడు (కార్తికేయుడు)ని నియమ నిష్టలతో పూజిస్తారు కాబట్టి కొన్ని చోట్ల స్కంద షష్టిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఒకే రోజన రెండు పండుగలన్న మాట. కొంతమంది స్కందుడిని నియమ నిష్టలతో ఆరాధిస్తే కొందరు సూర్యుడిని ఆరాధిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు సూర్యుడిని ఆరాధిస్తారు.