శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఎప్పుడు? పూజా సమయం ఏంటి?

విష్ణుమూర్తి పది అవతారాలను ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పది అవతారాల్లో శ్రీ మహా విష్ణువు నాల్గవ అవతారం నరసింహ అవతారం. ఈ అవతారం కాస్త భయం గొలిపేలా ఉంటుంది. సగం మానవ శరీరంతోనూ.. మిగిలిన సగం సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. హిరణ్య కశ్యపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. ఇలా స్వామివారు నరసింహ అవతారాన్ని ఎత్తిన రోజును నరసింహ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున స్వామివారిని పూజించి ఉపవాసం ఉంటే మంచిదని చెబుతారు. మరి ఈ ఏడాది లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి తిథి మంగళవారం మే 21 సాయంత్రం 5:39 నుంచి ప్రారంభమై.. మే 22 సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి 21నే నరసింహ స్వామివారి జయంతిని జరుపుకుంటాం. ఇక ఈ రోజున ఏ సమయంలో స్వామివారిని పూజిస్తే సత్ఫలితం ఉంటుందంటే.. మే 21 సాయంత్రం 4:24 నుంచి 7:09 వరకు నరసింహ స్వామిని ఆరాధించడానికి అనుకూలమైన సమయమని పంచాంగం చెబుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది స్వామివారి జయంతి రోజున రవియోగం, స్వాతి నక్షత్ర యోగం కూడా ఏర్పడుతోంది. ఇక ఉపవాసాన్ని మే 21న ప్రారంభించి మే 22న ఉదయం సూర్యోదయం తర్వాత ముగించాలి.

Share this post with your friends