మోక్షద ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఉపవాసం చేస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించుకుంటాం. మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మోక్షం కలుగుతుందట. అయితే ఇలాంటి ప్రత్యేక దినాల్లో ఏదైనా ప్రత్యేక యాధృచ్చికం ఏర్పడితే దానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. అలాంటి ప్రత్యేక దినాల్లో విష్ణుమూర్తిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం లభించి ఆనందం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయట. మరి ఈ ఏడాది మోక్షద ఏకాదశి ఎప్పుడు రానుంది? ఆ రోజున సంభవించే అరుదైన యోగాలు ఏంటో తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం ఈసారి మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి తిధి డిసెంబర్ 11వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3.42 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 12వ తేదీ గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు ముగుస్తుంది. మనం ఉదయ తిథి ఆధారంగా ఏ పండుగనైనా జరుపుకుంటాం కాబట్టి ఉదయతిథి ఆధారంగా ఈ ఏడాది డిసెంబర్ 11న మోక్షద ఏకాదశి వ్రతం పాటించాల్సి ఉంటుంది. ఉపవాసం చేసే వారు తదుపరి రోజున ఉపవాసాన్ని విరమించుకోవాలి. డిసెంబర్ 11న భద్ర, రవి, వారియన, వాణిజ, విష్టి యోగం అనే యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా భద్రావస్ యోగ సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే ఫలితం చాలా బాగుంటుందట.