హిందూ మత విశ్వాసాల ప్రకారం మాస శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజును శివ భక్తులైతే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అసలు మనం మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకుంటామంటే.. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థశి తిథి నాడు జరుపుకుంటాం. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపపోతాయని విశ్వాసం. ఈ రోజున ఉపవాసం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఉపవాసం చేస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందట. ప్రదోష కాలానికి స్పర్శ ఉన్న సమయాన్నే చతుర్దశి తిథిగా పరిగణిస్తారు.
అసలు ఈ మాసంలో మాస శివరాత్రి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. చతుర్దశి తిథి ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 3:32 గంటలకు ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుందంటే.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 30 డిసెంబర్ 2024న ముగుస్తుంది. కాబట్టి మనం మాస శివరాత్రిని ఈ నెల 29న జరుపుకోనున్నాం. ఇక ఈ రోజున శివపార్వతులను పూజించుకునేందుకు మాస శివరాత్రి నాడు సరైన సమయం ఏంటంటే.. డిసెంబర్ 29న ఆదివారం రాత్రి 11:26 గంటల నుంచి మరుసటి రోజు డిసెంబర్ 30న మధ్యాహ్నం 12:51 గంటల వరకు ఉంటుంది. ముఖ్యంగా మాస శివరాత్రి నాడు శివయ్యను నిశిత కాలంలో పూజిస్తారు.