జేష్ఠ్య పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి?

పౌర్ణమి అంటేనే హిందువులకు ప్రత్యేకం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున గంగా స్నానం చేసి.. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి.. ఆపై తెల్లని వస్త్రం, చక్కెర, బియ్యం, పెరుగు లేదా వెండి వస్తువులను దానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలో చంద్రుడి స్థానం బలపడి జీవితంలో సంతోషం నెలకొంటుందట. జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందట. మన ఇంట ఆర్థిక సంక్షోభం అనేదే ఉండదట. ఇక ఈ జేష్ఠ్య మాసంలో వచ్చే పౌర్ణమి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమై… జూన్ 22, 2024 ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. కాబట్టి జూన్ 21 శుక్రవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటాం.

జూన్ 22న కూడా జేష్ఠ్య పూర్ణిమను జరుపుకుంటాం. అయితే ఈ రోజున దానధర్మాల వంటివి చేస్తారు. ఇక 21న చంద్రునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే.. చంద్రోదయానంతరం ఒక పాత్రలో పాలు నింపి పంచదార, పచ్చి బియ్యం కలిపి సమర్పించాలి. ఆ సమయంలో చంద్రుడికి సంబంధించిన మంత్రం జపిస్తే ఆర్థిక కష్టాలన్నీ మాయమవుతాయట. అలాగే ఎర్రటి గుడ్డలో 11 గవ్వలను చుట్టి.. పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి పసుపు లేదా కుంకుమ తిలకం దిద్ది పూజ చేయాలి. పూజానంతరం గవ్వలను దుస్తులతో పాటు సురక్షితంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్మకం.

Share this post with your friends