అసలు హనుమజ్జయంతి ఎప్పుడు?

పరాశర సంహితను అనుసరించి తెలుగువారు హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు నిర్వహించుకుంటారు. ప్రాంతీయ ఆచారాలను బట్టి హనుమజ్జయంతిని వివిధ తిథుల్లో జరుపుకునే ఆచారం ఉంది. ఉత్తరాదివారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి. దానినే మనవారు హనుమద్విజయోత్సవంగా వర్ణిస్తారు. ఆనాడు హనుమంతుడు సీతను కనుగొని తిరిగి వచ్చాడంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతి నాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు.

తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ర్వతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు. ప్రాంతీయ ఆచారాలను బట్టి హనుమజ్జయంతిని నిర్వహించుకోవాలి. చైత్రమాసంలోనూ, వైశాఖమాసంలోనూ కూడా కొండగట్టులో హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. అక్కడ పౌర్ణమిని చిన్న హనుమజ్జయంతి అనడం ఒక ఆచారం.

Share this post with your friends