ఏకదంత సంకష్ట చతుర్థి ఎప్పుడు? దాని ప్రాధాన్యతేంటి?

హిందూ మతంలో ప్రతి ఒక్క తిథికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే ఏకదంత సంకష్ట చతుర్థికి సైతం చాలా ప్రాధాన్యత ఉంది. వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిని ఏకదంత సంకష్ట చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాం. ఏకదంత అంటే అర్థమై ఉంటుంది కదా.. అవును.. ఈ రోజు ప్రత్యేకంగా వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. నిజానికి ఈ తిథి వచ్చేసి నెలలో రెండు సార్లు వస్తుంది కానీ వైశాఖమాసంలో వచ్చే ఏకదంతం సంకష్ట చతుర్థికే ప్రత్యేకత ఉంటుంది. మరి ఇది ఈ ఏడాది ఎప్పుడొస్తుందంటారా?

హిందూ క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తేదీ ఆదివారం మే 26న రానుంది. ఇక ఈ సంవత్సరం ప్రత్యేకతేంటంటే.. చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి రోజున సాధ్య యోగం ఉదయం 08:31 వరకూ మొదటి సారిగా రూపొందనుంది. ఆ వెంటనే శుభ యోగం ఏర్పడనుంది. ఇది రోజంతా ఉంటుంది. ఈ యోగంలో గణేశుడిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఇక ప్రదోష కాలంలో గణేశుడిని పూజిస్తే మరింత సత్ఫలితాలు సంభవిస్తాయట. ఆ సమయంలో వినాయకుడిని పూజిస్తే ఆదాయం, అదృష్టం రెండూ పెరుగుతాయని నమ్మకం.

Share this post with your friends