వ్యక్తికి 60 ఏళ్లు నిండే సమయంలో ఓ గండం.. దానికి ఏం చేస్తారంటే..

తెలుగు పంచాంగం ప్రకారమైన తెలుగు సంవత్సరాలు మొత్తంగా 60 ఉంటాయి. ప్రభవ మొదలుకొని అక్షయ వరకూ తెలుగు సంవత్సరాలు ఉంటాయి. వ్యక్తి పుట్టుక అనేది ఈ 60 సంవత్సరాల్లోనే ఉంటుంది. ఏదో ఒక సంవ్సతరంలో పుట్టిన వ్యక్తికి తిరిగి 60 ఏళ్లు వచ్చే సరికి తిరిగి అతను జన్మించిన సంవత్సవరం వస్తుంది. అలా రావడాన్ని షష్టిపూర్తి అంటారు. మరి దీనిని వేడుకగా ఎందుకు చేసుకోవాలంటే దీనికి ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణంలో ఒక విషయాన్ని తెలిపారు. కాలగమనంలో ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు నిండే సమయంలో ఒక గండం పొంచి ఉంటుందట. ఆ గండాన్ని తొలగించేందుకు షష్టిపూర్తి పేరుతో చేసే ఉత్సవంలో ఆయుష్షు హోమం, భీమరథి ఉత్సవం వంటి శాంతి హోమాలను జరిపిస్తారు. ఈ హోమాల కారణంగా వచ్చే గండం తొలగిపోయి వ్యక్తం సంపూర్ణ ఆయుష్షుతో జీవిస్తాడని నమ్మకం. అందుకే షష్టిపూర్తి వేడుకను ఘనంగా జరిపించుకుంటారు.

Share this post with your friends