జీవితంలో సమస్యలు లేని మనిషంటూ ఉండరు. సమస్యలు లేని కుటుంబమంటూ ఉండదు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారం, కుటుంబంలో ఇలా ఏవో ఒక సమస్యలు లేని జీవితమైతే ఉండదు. వీటిని నుంచి బయటపడేదెలా? అని అంతా ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ఓ పరిష్కారాన్ని పండితులు సూచిస్తున్నారు. అది మరేదో కాదు ఏనుగు బొమ్మలట. మన ఇంట్లో వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మలను పెట్టుకుంటే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారని వాస్త్రు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మనం ఏం పని చేపట్టినా కూడా తప్పక విజయం సాధిస్తామట.
ఎవరికి తోచిన విధంగా వారు సైజుతో సంబంధం లేకుండా స్తోమతకు తగినట్టుగా వెండి ఏనుగు బొమ్మలను కొనవచ్చు. ఇక మరి వీటిని ఎక్కడ పెట్టాలంటారా? మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఏదైనా సంస్థను నడుపుతుంటే దానిలో అయినా పెట్టవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఏనుగు బొమ్మలను ఫలానా దిక్కులోనే పెట్టాలన్న నిబంధన ఏమీ లేదు. ఏదో దిక్కులో పెట్టినా కూడా ఏదో ఒక ప్రాధాన్యం అయితే ఉంటుంది. వెండి ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉత్తరం దిక్కులో పెడితే.. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడతారు. ఆఫీసులో, వ్యాపార స్థలంలో వెండి ఏనుగులను పెట్టుకోవడం వల్ల.. వ్యాపార సమస్యలన్నీ తొలగిపోతాయి. వెండి ఏనుగు బొమ్మలు పెడితే.. ఆర్థిక సమస్యలు తీరి.. ఐశ్వర్య వంతులు అవుతారు.