వైశాఖ మాసం పౌర్ణమి రోజున ఏం చేయాలంటే..

వైశాఖ మాసం పౌర్ణమి బుద్ధ పౌర్ణమిగా పిలవబడే వైశాఖ మాసం పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే 23వ తేదీ గురువారం వచ్చింది. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిదట. తద్వారా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. ఈ రోజున రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం అభిస్తుందని నమ్మకం. అలాగే మొక్కలను నాటాలట. ఇలా చేస్తే గురు గ్రహం చెడు ప్రభావం మనపై ఉండదని అంటారు. శ్రీహరి రావి చెట్టుపై ఉంటాడని చెబుతారు. అందుకే ఈ రోజున రావి చెట్టును పూజిస్తే శ్రీహరిని పూజించినట్టేనట.

అంతేకాకుండా రావి చెట్టులో ముక్కోటి దేవతలు నివసిస్తారు. తెల్లవారుజామునే నిద్ర లేచి రావి చెట్టుకు నీరు పోసి దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి రావి చెట్టుకు నైవేద్యంగా పెడితే మన పూర్వీకులు సంతృప్తి చెందుతారట. సూర్యోదయానంతరం రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుందట. కాబట్టి సూర్యోదయానంతరం రావిచెట్టును పూజించడం వల్ల ఇంట్లో ఆర్థికంగా బాగుంటుందట. వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే బృహస్పతి, శని శుభ ఫలితాలను ఇస్తారు. తద్వారా కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Share this post with your friends