
మహాలయ పక్షం తప్పనిసరిగా 15 రోజుల పాటు ఉంటుంది. ఈ పదిహేను రోజులు పూర్తిగా పితృదేవతల పూజలను నిర్వహిస్తారు. మహాలయ పక్షంలో చేయవలసినవి
ప్రతిరోజూ తర్పణం, శ్రాద్ధం చేయాలి. పితృ తిథి తెలిసినవారు ఆ రోజు శ్రాద్ధం చేయాలి. తెలియని వారు మహాలయ అమావాస్య (సెప్టెంబర్ 21, 2025) నాడు తప్పనిసరిగా శ్రాద్ధం చేయాలి. ఈ రోజుల్లో శుభకార్యాలు చేయరాదు.
శ్రాద్ధ ప్రాముఖ్యత
ఈ కాలంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తే పితరులు భూమికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మహాలయ అమావాస్య నాడు వారు సంతతి ద్వారం దగ్గరే నిలబడి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు.
శ్రాద్ధం చేయకపోతే దీవెన బదులుగా శాపం లభిస్తుందని పేర్కొనబడింది.
శ్రాద్ధం చేసే మార్గాలు
నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించాలి.
అన్నదానం అక్షయఫలం ఇస్తుంది.
శాకాహారంతో చేసిన శ్రాద్ధం కూడా ఫలదాయకమే.
ఆర్థికంగా కుదరకపోతే గోవుకు గ్రాసం పెట్టినా, లేదా కేవలం ఆకాశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నా అది పితృదేవతలకు అర్పణమవుతుంది.
శాస్త్రవాక్యం
మహాలయ పక్షంలో శ్రద్ధతో చేసే అన్నదానం – అనంతకోటి యజ్ఞఫలం ఇస్తుంది.
మఖ నక్షత్రంలో చేసిన శ్రాద్ధం అక్షయఫలం కలిగిస్తుంది.
