వైకుంఠ ఏకాదశి నాడు చేయాల్సినవి.. చేయకూడనివేంటి?

ఈ నెల 10న మనం వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకోనున్నాం. ఉపవాసం ఉండడంతో పాటు దానధర్మాలు చేస్తే చాలా మంచిదని నమ్మకం. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఏయే వస్తువులు దానం చేయడం శుభ ప్రదమో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేస్తే చాలా మంచిదట. పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేసినా కూడా పుణ్యం కలుగుతుందట. అలాగే గోవును దానం చేసినా కూడా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

వైకుంఠ ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏంటంటే.. మనసులో ప్రతికూల ఆలోచనలకు తావివ్వవద్దు. అబద్ధం చెప్పడం, కోపం తెచ్చుకోవడం వంటివి చేయకూడదు. మాంసాహారం తీసుకోకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి వాడవద్దు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగి స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని చెబుతారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగి.. ఆనందం , సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి. ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారికి మోక్షం లభిస్తుందట.

Share this post with your friends