ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ధనలాభం కోసం ఏం చేయాలంటే..

ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం కలగాలని ఎవరికి ఉండదు? కానీ దానికి మార్గం తెలియక ఇబ్బంది పడుతుంటారు. వారు ఇలా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా శనివారం రాత్రి పూట ఈ పరిహారం చేస్తే కలసి వస్తుందని చెబుతారు. దీని కారణంగా వాహన దిష్టి దోషం తొలగిపోవడమే కాకుండా ఆర్థికంగానూ బాగా కలిసి వస్తుందట. అదేంటో తెలుసుకుందాం. నెలకు ఒకసారి లేదా మూడు నెలలకోసారి మీ కారు లేదా బైక్‌ను మొత్తం వాటర్‌తో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పసుపు, గంధం కొద్దిగా రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.

ఆపై మీ వాహనం ముందు.. వెనుక భాగంలో రెండు చొప్పున నిమ్మ దీపాలు వెలిగించాలి. వాటిని ఎలా వెలిగించాలో ముందుగా తెలుసుకుందాం. నిమ్మదొప్పలను తీసుకొని దానిలో నువ్వుల నూనె పోసి కుంభవత్తి వేసి దీపం పెట్టాక చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని ముందుకు కదిలించాలి. ఇలా తరచుగా అంటే వాహనానికి నెలకోసారి లేదా మూడు నెలలకోసారి దిష్టి తీసుకోవడం చేయాలి. ఇలా చేస్తే వాహన దిష్టి దోషం తొలగిపోవడంతో పాటు మీకు కూడా రక్షణ ఉంటుందట. పైగా మీ ప్రయాణాలు సాఫీగా సాగి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుందని నమ్మకం.

Share this post with your friends