సోమవతి అమావాస్య నాడు చేయకూడనిదేంటి?

సోమవతి అమావాస్య ఎప్పుడో తెలుసుకున్నాం. ఆ రోజున ఏం చేస్తే మంచిదనేది కూడా తెలుసుకున్నాం. అయితే సోమవతి అమావాస్య నాడు శివపార్వతులను పూజిస్తే చాలా మంచిదని తెలుసుకున్నాం. అలాగే శివలింగానికి పంచామృతంతో పాటు నీళ్లతో అభిషేకం నిర్వహిస్తే చాలా మంచిదట. మన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. జీవితం సుఖంగా సాఫీగా సాగుతుందట. అయితే సోమవతి అమావాస్య నాడు ఉపవాసం చేసినా కూడా ప్రయోజనం చాలా బాగుంటుందట. ఈరోజున పేదలకు అన్నదానం చేసినా చాలా మంచిదట. అలాగే రావిచెట్టుకు నీరు పోసి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందట.

ఈ రోజున పార్వతీదేవిని ఆరాధిస్తే సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యం లభిస్తుందట. అలాగే శివపురాణం పఠించినా కూడా చాలా మంచిదట. మనసు ప్రశాంతంగా ఉంటుందట. సోమవతి అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించి శివుడిని పూజించుకోవాలి. అయితే ఈరోజున చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని దుస్తులు ధరించకూడదు. మాంసం, మద్యం స్వీకరించకూడదు. అబద్ధాలు చెప్పడం, ఎవరిపైనైనా కోప్పడం, దూషించడం వంటివి చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు.

Share this post with your friends