తపస్సు వల్ల ఏం జరుగుతుంది?

ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. అలాగే పురాణాల్లో ఏ భగవంతుడినైనా ప్రసన్నం చేసుకోవాలంటే తపస్సు చేసేవారు. తపస్సు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే మెడిటేషన్. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా.. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రశాంతంగా దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే ఉండేవారు.అసలు తపస్సు వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే తపస్సు.ఇలా చేయడం వల్ల మనసులో ఎలాంటి బాధ ఉన్నా తొలిగిపోతుంది. అనారోగ్య సమస్యలన్నీ పోతాయి.

మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ సతమతమవుతూనే ఉంటుంది. అలాంటపపుడు తపస్సు ఎలా సాధ్యం అంటారా? మనస్సును నియంత్రించుకోవాలి. నిత్య సాధనకు మించింది లేదు. నిత్యం సాధన చేస్తే మనసుపై పట్టు సాధించగలం. ఒకసారి పట్టు సాధించాక మనసు మనం ఎటు వెళ్లమంటే అటు వెళుతుంది. అయితే మనసును మంచి వైపు మాత్రమే మళ్లించాలి. అప్పట్లో అంటే దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చేసేవారు. ఇప్పుడు దేవుళ్లతో పాటు మనం ప్రశాంతంగా జీవించడం కోసం చేయాలి. ప్రస్తుత కాలంలో జీవితమే పెద్ద పోరాటంగా మారిపోయింది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. వీటికి మనసుపై నియంత్రణ సాధిస్తే మాత్రమే చెక్ పెట్టగలం.

Share this post with your friends