శ్రీకృష్ణుడి శరీర ఛాయ నీలంగా ఉండటానికి కారణమేంటి?

శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో అధర్మాన్ని నశింపజేసేందుకు దేవకీ, వసుదేవులకు జన్మించాడు. దేవకి అష్టమ సంతానం సంహరిస్తుందని కంసుడికి ఆకాశవాణి ద్వారా తెలిసింది. ఇక అంతే దేవకీ గర్భాన జన్మించిన వారందరినీ కంసుడు చంపేస్తాడు. శ్రీకృష్ణుడిని వసుదేవుడు పుట్టగానే రేపల్లెకు తీసుకెళ్లి కాపాడతాడు. ఇదంతా ఒక కథ అయితే.. శ్రీకృష్ణుడి మేని ఛాయ నీలంగా ఎందుకుంటుందటే.. కంసుడు ఆయనను సంహరించేందుకు చేసిన ప్రయత్నాలలోనే వేణుగోపాలుడి మేని నీలం రంగులోకి మారిందని కొందరు చెబుతారు. మరి అసలు కారణం ఏంటి? దీని వెనుకున్న కథలేంటో తెలుసుకుందాం.

రేపల్లెలో ఉన్నది శ్రీకృష్ణుడేనని తెలుసుకున్న కంసుడు.. ఆయనను సంహరించేందుకు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. పూతన తన చనుబాలను శ్రీకృష్ణుడికి ఇచ్చి సంహరించాలని చూస్తుంది. బాలకుడైన శ్రీకృష్ణుడికి విషయం అర్థమవుతుంది. అందుకే పూతన పాల పేరుతో విషాన్ని ఇచ్చినా తాగేసి ఆమెను సంహరించాడు. విషం తాగడంతో కృష్ణుడి మేని ఛాయ నీలంగా మారిందని అంటారు. మరో కథ ఏంటంటే.. శ్రీకృష్ణుడు నది ఒడ్డున గోపికలతో ఆడుకుంటుండగా.. బంతి యమునా నదిలోకి వెళుతుంది. అప్పుడు బాలు కోసం యమునా నదిలోకి వెళ్లిన కృష్ణుడిని కాళేయుడు పట్టుకుంటాడు. కాళీయుడికి, శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరగ్గా శ్రీకృష్ణుడు విజయం సాధించి ఆ కాలేయుడిపైనే ఒడ్డుకు చేరుకుంటాడు. అయితే యమునా నదిలో విషం ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారిందని అంటారు.

Share this post with your friends