
మనం చాలా చిత్రపటాల్లో.. ఆలయాల్లో చూస్తుంటాం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవళించి ఉండటం వెనుక కథేంటనేది తర్వాత తెలుసుకుందాం. ముందు అసలు ఇలా పవళఇంచి ఉండటం వెనుక ఆంతర్యమేంటనేది తెలుసుకుందాం. ఆలయాల్లోనూ.. చిత్ర పటాల్లోనూ ఆది శేషుడు శేష శయనంపై పమళించి ఉండటాన్ని చూస్తాం కానీ దాని ఆంతర్యమేంటనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి పాలకడలిలో శేష శయనంపై ఉండడమంటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడని అర్థం.
యోగ నిద్రలో ఉన్నాడంటే జగద్రక్షణ చింతలో ఉన్నాడని ఆంతర్యం. ‘రక్షాపేక్షాం ప్రతీక్షతే’ దారి తప్పిన జీవులను రక్షించాలనే కోరికతో పాల కడలిలో పరమాత్మ ప్రతీక్షిస్తూ ఉంటాడట. ఆదిశేషుడు స్వస్వరూప జ్ఞానం కల జీవునికి ప్రతీక. భగవంతుని అనంత కళ్యాణ గుణాలకు క్షీర సముద్రం ప్రతీక. జ్ఞానంలో ఉండవలసిన అయిదు విధాలు ఆదిశేషుని అయిదు శిరస్సులకు ప్రతీకలు. మహా విష్ణువు పక్కనే మహాలక్ష్మి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులను చేరుకుని, ఆదుకుని పరమాత్మకు అందిస్తూ ఉంటుందట.
