తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ స్థల పురాణం ఏంటంటే..

తమిళనాడులోని తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం ముల్లోకాలను తారకాసురుడు ఇబ్బందులకు గురి చేసేవాడు. అదే సమయంలో సూర పద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెదుకుతుంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుణ్ణి పూజించాడట. ఈ తరువాత తారకాసురుని కుమారస్వామి వధించాడట.

తారకాసురుని మరణానంతరం సూర పద్మం అనే రాక్షసుడు తనను కూడా సుబ్రహ్మణ్య స్వామి వధిస్తాడనే భయపడ్డాడట. దీంతో వెళ్లి ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు. విషయాన్ని గ్రహించిన కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలుగా ఛేదించాడట. ఆ తరువాత అందులో ఉన్న రాక్షసున్ని సంహరించాడు. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని తన వాహనాలుగా సుబ్రహ్మణ్యస్వామి స్వీకరించి స్వామివారు అక్కడే కొలువయ్యారట.

Share this post with your friends