సంక్రాంతి పిండివంటల ప్రాముఖ్యతేంటి?

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేసే ప్రతి పనికి కూడా ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. పండుగ సందర్భంలో వేసే రంగవల్లులు లేక ముగ్గులు అనేవి నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు. ఆకాశంలో మెరిసే చుక్కలు స్థిరంగా ఉంటాయి. అలాగే నేలపై మహిళలు పెట్టే చుక్కల రంగవల్లులు సైతం చక్కటి కళారూపాలను సృష్టిస్తాయి. ఇక సంక్రాంతి పండుగ నాడు చేసే పిండి వంటలు ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్రం చెప్పింది.

శాస్త్ర ప్రకారం ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్ధాలు. మనం ఇప్పుడు చెప్పుకున్న పిండివంటల్లో గుమ్మడికాయ ఒక్కటి తప్ప మిగిలినవి మన శరీరాన్ని వెచ్చబరచి జనవరిలోని చలి నుంచి మనలను రక్షిస్తాయి. అలాగే గుమ్మడి కాయ ప్రాధాన్యత మరింత గొప్పది. ఇది స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్య దోషాలను నివారించే గొప్ప ఔషధం. సంతాన సమస్యలకి గుమ్మడికాయను మించిన మందు మరోటి లేదని పెద్దలు చెబుతారు. అలాగే ఈ రోజున గొబ్బెమ్మలను అలంకరిస్తారు కదా.. వాటిలో ఉపయోగించే బంతి, చామంతి, డిసెంబరాలు, ముళ్ల గోరింట, గుమ్మడి పూలను స్పృశించడం కూడా ఆరోగ్యప్రదమే.

Share this post with your friends