లడ్డూ ప్రసాదం అనగానే మనకు గుర్తొచ్చేది నిస్సందేహంగా తిరుమలే. ఈ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇండియా నుంచి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తిరుమల లడ్డూను అడుగుతారు. అంతటి ప్రాధాన్యత ఉంది శ్రీ మలయప్ప స్వామివారి లడ్డూ ప్రసాదానికి. లడ్డూ ప్రసాదం మాత్రమే కాదు.. కోట్లాడి హిందువుల ఎమోషన్. అలాంటిది ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశం మొత్తాన్ని నివ్వెరపరుస్తున్నారు. అంతటి ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి లడ్డూకి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 310 ఏళ్లు.
1715లో శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. అయితే భక్తుల చేతికి మాత్రం 1940 నుంచే లడ్డూ అందేదట. అంతకు ముందు స్వామివారికి మాత్రమే లడ్డూను నైవేద్యంగా సమర్పించేవారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ప్రసాద విక్రయం కూడా నాటి నుంచే ప్రారంభమైందన్న వాదన కూడా ఉంది. 1933లో తొలిసారిగా తిరుమల తిరుపతి దర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఆ తరువాత 1940లో బూందీని లడ్డూగా చుట్టి భక్తులకు అందజేసేవారు. లడ్డూల తయారీకి వాడాల్సిన ముడి సరుకుల మోతాదును దిట్టం పేరిట టీటీడీ టీటీడీ ధర్మకర్తల మండలి ఫిక్స్ చేసింది. అక్కడి నుంచి దిట్టం పరిమాణాలను పరిస్థితులకు అనుగుణంగా పెంచుతూ వచ్చింది. ఒక లడ్డూ తయారీకి టీటీడీ రూ.48 వెచ్చిస్తోంది. ప్రస్తుతం ఒక లడ్డూను రూ.50 చొప్పున టీటీడీ అందిస్తోంది.