హనుమంతుడికి, అర్జనుడికి మధ్య సవాల్ ఏంటి?

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దేశాటనలో భాగంగా అర్జనుడు.. రామేశ్వరానికి వెళ్లి ఆపై రామసేతువును పరిశీలించాడని తెలుసుకున్నాం కదా. అర్జనుడి మనసులో మాట హనుమంతుడికి తెలిసి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట. రాములవారు బాణాలతో సేతువును నిర్మించలేక కాదని.. కొన్ని కోట్ల మంది వానరులు వంతెన మీదుగా ప్రయాణిస్తే ఇబ్బందవుతుందని రాళ్లతో నిర్మించాడని చెప్పాడు. హనుమంతుడు చెప్పిన సమాధానంతో ఏకీభవించలేదట. రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సిందంటూ వాదనకు దిగడంతో మాటామాటా పెరిగింది.

‘సాక్షాత్తూ రాములవారినే అవమానిస్తావా? నువ్వు కూడా గొప్ప విలుకాడివి కదా.. నా బరువును తట్టుకునే వంతెన నిర్మిస్తే సరి.. లేదంటే నీ ఓటమిని ఒప్పుకుంటావా?’ అని సవాల్ విసిరాడట. అలాగేనని అర్జనుడు అన్నాడట. పైగా హనుమంతుడి ధాటికి తాను కట్టిన వంతెన కూలిపోతే ప్రాణ త్యాగం చేస్తానన్నాడట. అర్జనుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి శరములతో అద్భుతమైన వంతెనను నిర్మించాడట. కానీ హనుమంతుడు శ్రీ రామ నామాన్ని జపిస్తూ ఒక్క అడుగు వేయగానే కూలిపోయింది. దీంతో అర్జనుడు అవాక్కయ్యాడట. ఓటమిని ఒప్పుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడగా.. ఓ బ్రాహ్మణుడి రూపింలో శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడట.

Share this post with your friends