మకర తోరణం అంటే ఏమిటి?

మకర తోరణం అనే పదాన్ని దేవాలయానికి వెళ్లిన ప్రతిసారీ వింటుంటాం కానీ అదేంటో చాలా మందికి తెలియదు. అసలు మకర తోరణం అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణo మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనబడుతుంది. దానికే ‘మకర తోరణం’ అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొందాడు.

తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు.. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణం లేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్త సులభుడైన బోళా శంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు.

Share this post with your friends