
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆలయ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. శ్రీగోవిందరాజస్వామి వారి ఐశ్వర్యాభివృద్ధి కోసం స్వామివారి దక్షిణ పార్శ్వమునందు ఒక గుడిలో ఆండాళ్ అను గోదాదేవిని కూడా ప్రతిష్ట చేయించారు. దేశాధిపతి అయిన యాదవ భూపాలుడు ఈ ఆలయ ప్రాంతమునకు “రామానుజపురం” అని నామ ధేయముంచి, శ్రీరామానుజాచార్యులవారి దివ్యాజ్ఞ మేరకు, శ్రీ గోవిందరాజ స్వామి వారికి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి వలె, నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులను చేసేవారు.
తదుపరి నాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్సవాలను క్రమంగా నిర్వహిస్తున్నారు. శ్రీగోవిందరాజస్వామి వారి ప్రాంగణంలో శ్రీ పార్థసారధిస్వామి వారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవద్రామానుజులవారి సన్నిధి, తిరుమలనంబి, అనంతాళ్వారులు, ఆళ్వార్ల సన్నిధులు మున్నగు ఉప ఆలయాలు చోటు చేసుకున్నవి. అందువల్లే ఆలయాల సముదాయంగా శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయం ప్రధానంగా వెలిసి యున్నది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
వాహన సేవలు వివరాలు:
02వ తేదీ రాత్రి 07 గంటలకు పెద్ద శేష వాహనం
03.06. 2025 – ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
04.06. 2025 – ఉదయం– ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025 – ఉదయం– కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025 – ఉదయం– మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
07.06. 2025 – ఉదయం– హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
08.06. 2025 – ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025 – ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
10.06. 2025 – ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం
