తర్పణం అనే పదాన్ని వినని హిందువు అయితే ఉండరు. అయితే అసలు తర్పణం అంటే అర్థమేంటంటే.. పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలుగా ఉంటుంది. ముఖ్యంగా రెండు రకాలుగా తర్పణం చేస్తాం. అవేంటంటే.. సకామ, నిష్కామ. సకామ తర్పణమును కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేస్తారు. ఇక ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు. అవి ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
గరుడ తర్పణం: ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.
బ్రహ్మ యజ్ఞ తర్పణం : నిత్యానుష్టానంలో భాగంగా విడిచే తర్పణం.
పర్హెణి తర్పణం: ప్రతి ఏటా చేసే పితృకర్మల తరువాతి రోజు ఇచ్చే తర్పణాలు.
సాధారణ తర్పణం: అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.
తర్పణము వదలడము వలన దేవతలు త్వరగా సంతృప్తి చెందుతారట.