మౌనవ్రతం అంటే ఏంటి? ఎలా చేయాలి?

కొందరు మౌన వ్రతం ఆచరిస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు? దీని వలన ఉపయోగాలేంటో చూద్దాం. ఎవరితోనూ మాట్లాడకుండా భగవంతునిపై భక్తితో నిమగ్నమై ఉండటమే మౌన వ్రతం. మానవ శరీరంలోని శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు.. వీటిని జ్ఞా నేంద్రియాలు అంటారు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రత ఉద్దేశం. ఎవ్వరినీ తాకకుండా.. ఏదీ చూడకుండా.. ఏదీ వినకుండా.. ఏదీ మాట్లాడకుండా.. ఘన పదార్థాలేవీ ముట్టకుండా.. చేయడమే మౌనవ్రతం. ఇంద్రియాలన్నీ పూర్తి మౌనం పాటించడమే దీని లక్ష్యం. ఇక ఆహారం విషయానికి వస్తే కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఘన పదార్థాలు తీసుకోకూడదు.

ఇలా నిష్టగా చేసే మౌన వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందట. మనం మన జీవిత కాలంలో క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై యంత్రం మాదిరిగా పనులు చేస్తూనే ఉంటాం. దీని వలన మనసు, శరీరం రెండూ అలసిపోతాయి. కాబట్టి మౌన వ్రతం ఆచరించడం వలన ఇవి రెండూ సాంత్వన పొందుతాయి. దేహమే దేవాలయం అన్నారు పెద్దలు. కాబట్టి ఆ దేహాన్ని పూర్తి స్థాయిలో కాసేపు భగవత్ ధ్యానంలో ఉంచాలి. ఇలా మౌన వ్రతం ఆచరించినప్పుడు మనసు, శరీరానికి హీలింగ్ పవర్ పెరుగుతుందట. బాగా యాక్టివ్ అయిపోతుందట. అయితే మౌన వ్రతం చేస్తున్నాం కదాని టీవీ చూడటం.. పాటలు వినడం వంటి పనులు చేయకూడదు. పూర్తి భగవత్ ధ్యానంలో ఉంటేనే ఫలితం ప్రభావవంతంగా ఉంటుంది.

Share this post with your friends