
రోజులో ఏదైనా మంచి లేదంటే చెడు జరిగితే మనకు వెంటనే తట్టేది ఒకే ఒక్క విషయం.. ఇవాళ ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశామా? అని. చెడు జరిగిందో ఇంకెప్పుడు వారి ముఖం చూడకూడదని అనుకుంటాం. అసలు పొద్దుటే లేవగానే ఎవరి ముఖం చూస్తే మనకు మంచి జరుగుతుంది? అనే విషయం తెలుసుకుందాం. నిద్ర లేవగానే ముందుగా మన అర చేతులు చూసుకోవాలట. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందట.
మన అరచేతులు చూసిన తర్వాత నేరుగా వెళ్లి దేవుడి చిత్రపటాన్ని చూస్తే ధనవృద్ధి కలుగుతుందని నమ్మకం. ఏదైనా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి తీసుకుని రాత్రి పడుకునే ముందు పక్కన పెట్టుకుని ఉదయం లేచిన వెంటనే అద్దానికి బొట్టు పెట్టాలట. ఆ తరువాత అద్దంలో ముఖం చూసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందట. నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేనింది మొదలు పడుకునే వరకూ ఏం చేయాలనేది తెలుసుకుని ఆచరిస్తే మనకు మేలు కలుగుతుంది.
