బ్రహ్మ హతి దోషం అంటే ఏమిటి..? అది ఎలా ఏర్పడుతుంది..?

బ్రహ్మ హతి దోషం చాలా తక్కువ మంది విని ఉంటారు. కొన్ని సార్లు మనం ఆర్థికంగానూ.. శారీరకంగానూ.. మానసికంగానూ.. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. సమస్యలైతే ఉంటాయి కానీ దానికి కారణమేంటో తెలియదు. ఏ తప్పు చేస్తే బ్రహ్మ హతి దోషం ఏర్పడుతుంది? దాని నివారణ ఏంటో తెలుసుకుందాం. తోటి మనుష్యులు ప్రాణులకు హాని కలిగించినప్పుడు ఏర్పడే దోషమే బ్రహ్మహతి దోషం. బ్రాహ్మణ వంశంలో పుట్టిన రావణుడిని రాముడు వధించడం వల్ల బ్రహ్మహతి దోషం ఏర్పడింది. ప్రాణ హాని మాత్రమే కాదు.. భార్యకు కనీస అవసరాలు కల్పించకున్నా.. తల్లిదండ్రులకు తిండి పెట్టకున్నా.. బ్రహ్మణులను వేధించినా, గురువుకు దక్షిణ ఇవ్వకున్నా.. పాలిచ్చే ఆవును కబేళాకు పంపినా..ఈ దోషం కలుగుతుందట.

అలాగే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసగించినా.. ఇతరుల శ్రమను దోచుకున్నా.. ఆలయ ధ్వంసం, భగవంతుని విగ్రహ అపహరణ, ఇంటి దేవత ఆస్తుల ధ్వంసం ఇలాంటి పనుల కారణంగా బ్రహ్మ హతి దోషం ఏర్పడుతుంది. ఈ దోషం వల్ల వ్యాపారంలో అస్థిరత, వ్యాపార లోపం, నిరుద్యోగం ఏర్పడతాయి. ఈ దోషం కారణంగా ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటారట. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. కుటుంబంలో గౌరవం ఉండదట. పేదరికంలో మగ్గుతారట. ఎంత ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపు అనేది మాత్రం రాదట. కాబట్టి ఇలాంటి పాపాల జోలికి వెళ్లవద్దని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends