హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు వస్తుందంటేనే ఆలయాలన్నీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది కాబట్టి వైష్ణవాలయాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాసం ఉంటే మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలు అన్నీ నశిస్తాయట.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం మనం వైకుంఠ ఏకాదశిని 10వ తేదీన జరుపుకుంటున్నాం. ఉపవాసం ఆచరించాలనుకునేవారు జనవరి 10న ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండటంతో పాటు చేయాల్సిన మరో పని కూడా ఉంది. ప్రతి ప్రత్యేకమైన రోజున తప్పనిసరిగా దానధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుంది.