వ్యాసభగవానుడు ప్రజలకు మహోత్కృష్టమైన సేవ చేశారు. ఆయనే పూనుకోకుంటే మనం కలియుగంలో వేదాలను తెలుసుకుని ఉండేవారం కాదు. వేదాలు నాలుగు ఉన్నాయి. అవేంటంటే.. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. వీటిని కలియుగంలో చదవడం వ్యాసభాగవానుడు రాయకుంటే అసాధ్యం. మరి ఈ వేదం ఏం చెబుతోంది. వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విధానాలను గురించి మాత్రమే కాకుండా మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గురించి కూడా వివరిస్తుంది.ఇక ఉత్తరభాగం అంతా మనం మరో జన్మ లేకుండా కైవల్యాన్ని సాధించుకోవడం ఎలాగో చెబుతోంది.
ఇక పూర్వ భాగమును వ్యాస మహర్షి తన శిష్యుడైన జైమిని చేత వ్యాఖ్యానం చేయించారు. ఇది కర్మకు సంబంధించిన విషయాలన్నింటినీ వివరిస్తుంది. ఇక ఉత్తర భాగం వచ్చేసి జ్ఞానమునకు సంబంధించినది. దీనిని ఉత్తర మీమాంస అంటారు. దీనికి స్వయంగా వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములను రచించారు. అనంతరం వ్యాసుడు పద్దెనిమిది పురాణాలను రచ్చింది. అయితే ఇదంత తేలికైన పని కాదు. పురాణానికి ఐదు సర్గలు ఉండాలి. మన్వంతరాలలో జరిగిన విశేషాలను మన్వతరములలో చెప్పగలగాలి. అలా చెప్పగలిగిన వారు మాత్రమే పురాణమును చెప్పగలరు. అటువంటి పురాణాలను వేద వ్యాసుడు రచించాడు.