తులసి చెట్టును దైవంగా భావిస్తూ హిందువులంతా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంటి ముందు తులసి మొక్కను నాటి నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటాం. తులశమ్మ పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం వెల్లివిరిసినట్టే. ఇంట్లోని వారికి ఎలాంటి సమస్యలూ రావట. అలాగే తులసి చెట్టులోని ఒక్కో మార్పు ఒక్కో దానికి సంకేతమంటారు. మరి ఆ మార్పులేంటి? వాటిని మనం ఎలా తీసుకుంటూ ఉంటామో చూద్దాం. తులసి చెట్టుకు నీళ్లు పోయకుండానే మొక్క బాగా పచ్చగా ఏపుగా పెరుగుతున్నా దాన్ని అనర్ధం గానే భావిస్తూ ఉంటాం. ఇలా పెరిగితే ఇంట్లోని వారికి కలిసి రాదని భావిస్తూ ఉంటారు.
పచ్చగా కళకళలాడుతున్న తులిశమ్మ ఎండిపోవడం ప్రారంభిస్తే ఇంటి యజమానికి ఏదో కీడు జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఇంటి పెద్దకు అనారోగ్య సమస్య ఎదురయ్యే అవకాశముందని భావిస్తుంటారు. ఇక తులసి మొక్క ఆకులు రంగు మారడం ప్రారంభిస్తే.. ఇంట్లోని వారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని భావిస్తుంటారు. ఎవరైనా తమపై క్షుద్రశక్తులు ప్రయోగించారని.. అందుకే తులసి ఆకులు రంగు మారాయని భావిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంతవరకూ నిజమో కానీ హిందువులంతా దీనిని బాగా నమ్ముతారు. కాబట్టి తులసి మొక్కలో మొక్కలో మార్పులను గమనిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అంటుటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇలాంటి అవరోధాలేమీ ఉండవట.