పారిజాత పువ్వులను కోస్తూ ఇంద్రాది దేవతలంతా శ్రీహరి నిర్మాల్యాన్ని తొక్కి కుంటివారుగా మారిన కథ గురించి తెలుసుకున్నాం కదా. వారంతా తమ వాహనాలు సైతం కదలకపోవడంతో స్వర్గానికి పోలేక అక్కడే ఉండిపోయారు. ఇంతలో సత్రజిత్తు పుష్పవాటికకు వచ్చాడు. అక్కడ కుంటివారై కదల్లేని స్థితిలో ఉన్న ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు. మీరు కేవలం పారిజాత పూల కోసం వచ్చి ఇటువంటి దురవస్థకు లోనవడం ఆశ్చర్యంగా ఉందనడంతో దేవతలంతా సిగ్గుతో తలవంచుకున్నారు. ఇక తాను చేసేదేమి లేక సత్రజిత్తు తన కుటీరానికి వెళ్లిపోయాడు. కానీ దేవతలు మాత్రం ఆకలికి అలమటిస్తూ కుంటివాళ్లుగా మరి నరకయాతన పడసాగారు.
ఇలాగే ఒక్కరోజు కాదు.. 10 రోజులు గడిచింది. ఆహారం లేక దేవతలు క్రుంగి కృశించి మూర్ఛపోయారు. అప్పుడు దేవతలకు కలిగిన ఈ దురవస్థను చింతించిన సత్వజిత్తు పారిజాత వృక్షం దగ్గరకు వెళ్లాడు. దాని కింద ఉన్న విష్ణు నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచాడు. అనంతరం దేవతల దురావస్థను తొలగించడం కోసం తన భార్యతో కలిసి ఉపవాసం చేసాడు. స్వర్గంలో మిగిలిన దేవతలంతా ఇద్రాది దేవతలను వెదుకుతూ భూలోకానికి వచ్చారు. సత్వజిత్తు పుష్ప వాటికకు వచ్చి ఇంద్రాది దేవతల దువస్థసు చూసి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెకలించారు. కానీ ఎంత బలం ఉపయోగించినా పారిజాత వృక్షాన్ని మాత్రం కదపలేకపోయారు. ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.