ఎంతలా శివుడిని పూజించినా ఫలితం దక్కకపోవడంతో శిష్యుడికి గురువేం చెప్పాడంటే..

ఒకప్పుడు చైతన్యుడు అనే భక్తుడు ఉండేవాడు తను గురువు ద్వారా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది ఒక నారాయణుడి విగ్రహం ఇచ్చి దాని మీద దృష్టి సారించమని చెప్పాడు. చైతన్యుడు కూడా మంత్రాన్ని వల్లిస్తూ నిత్యం ఆ విగ్రహాన్ని పూజిస్తుండేవాడు. కానీ విగ్రహంలో చలనం లేదు. దేవుడు కూడా తనని గుర్తించినట్టు కనపడలేదు. చైతన్యుడు నిరాశతో తన గురువు దగ్గరకు చేరి తనను విష్ణుమూర్తి (విగ్రహం) కరుణించటం లేదని తనకు మరొక కొత్త ఉపదేశం చేయాల్సిందిగా గురువు ని కోరుకుంటాడు. చైతన్యుడి అజ్ఞానానికి నవ్వుకొని సరే అంటాడు.

ఈ మారు శిష్యుడికి శివ మంత్రాన్ని ఉపదేశించి శివుడి మూర్తిని ఇచ్చి.. భోలే నాథుడు త్వరగా కరుణిస్తాడని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు. చైతన్యుడు ఆరు నెలల పాటు నిర్విరామంగా మంత్ర జపము, శివ మూర్తి ఆరాధనలో నిమగ్నమయ్యాడు. మునపటి నారాయణుడి మూర్తిని పూజించకుండా దుమ్ము పట్టిన అటక ఎక్కించేశాడు. చాలా రోజులు శివుడి మూర్తిని పూజించి మంత్రాన్ని జపించినా కూడా చైతన్యుడికి ఫలితం కనిపించక మరీ నిస్పృహ చెంది తిరిగి గురువు దగ్గర కి పయనమయ్యాడు. గురువుని చేరిన చైతన్యుడు నిర్వేదంతో శివుడి మూర్తి కూడా కరుణించలేదు కావున తనని అనుగ్రహించు దేవ మూర్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో చూద్దాం.

Share this post with your friends