కర్ణి మాత ఆలయ విశేషాలేంటంటే..

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌లోని కర్ణి మాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఎలుకలను కర్ణి మాత వారసులని ఎందుకు అంటామో కూడా తెలుసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణి మాత ఆలయ ఇటీవల సందర్శించారు. దీంతో ఈ ఆలయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మోదీ పర్యటనతో ఈ ఆలయ విశేషాలు తెలుసునేందుకు హిందువులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. వాస్తవానికి రాజస్థాన్‌కు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వారంతా ఇప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు కూడా వస్తున్నారు.

ఈ ఆలయం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో జరిగింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పని తీరు, ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడి అద్భుతంగా ఉంటాయి. ప్రధాన ద్వారాలపై దేవతలు, దేవుళ్ళకు సంబంధించిన పౌరాణిక కథల అందమైన చెక్కడాలున్నాయి. ఈ ఆలయంలో నిత్యం హారతి, భజనలు పలు సార్లు ఉంటాయి. హారతి కార్యక్రమంతో పాటు భజనలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాకుండా రాజస్థాన్‌కి చెందిన గొప్ప వారసత్వ సంపదగా పరిగణిస్తున్నారు.

Share this post with your friends