శివునికి బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు పాటించే నియమాలేంటి?

పరమేశ్వరుడికి బిల్వపత్రాలు చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. స్వామివారికి బిల్వ పత్రాలతో పూజించితే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్మకం. అయితే బిల్వ పత్రాలతో స్వామివారిని పూజించేందుకు సైతం కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలను కొన్ని గ్రంథాల్లో పేర్కొన్నారు. అవేంటో చూద్దాం. శివుడికి బిల్వ పత్రాన్ని ఎప్పుడూ మృదువైన ఉపరితలం వైపు మాత్రమే సమర్పించాలి. అలాగే బిల్వ పత్రాన్ని ఒక్కొక్క ఆకుగా తెంపి ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు.

మూడు ఆకులతో కూడిన బిల్వపత్రంలో శివుడిని పూజించాలి. మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటారు. శివునికి 3 కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలను సమర్పించి పూజ చేయాలట. అలాగే ఎప్పుడూ కూడా బేసి సంఖ్యలో మాత్రమే స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించాలట. అంటే 3, 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో సమర్పించి పూజ చేయాలి. అలాగే బిల్వ పత్రాలను ఎప్పుడూ మధ్యవేలు, ఉంగరపు వేలు , బొటన వేలితో పట్టుకుని శివునికి సమర్పించాలి. ఒకసారి శివుడికి సమర్పించిన బిల్వ పత్రాలను తిరిగి కడిగి మరోసారి సమర్పించవచ్చు. వాటిని స్వామివారికి సమర్పించిన అనంతరం శివలింగాన్ని నీటితో అభిషేకించాలి.

Share this post with your friends