శ్రీవారి పంచమూర్తులు అంటే ఏమిటి ?

తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమనం ప్రకారం నిత్య పూజలు జరుగుతుంటాయి. అయితే ఈ నిత్యపూజలను అందుకునే ఐదుగురు స్వామివార్ల రూపాలను “పంచమూర్తులు” లేదా “పంచబేరాలు” అంటారు. బేరము అనగా విగ్రహ రూపమని అర్థం. పంచమూర్తులు ఏంటంటే.. మూలమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవమూర్తి. ఆ స్వామివారి పంచ రూపాలలో తొలి రూపమైన మూలమూర్తి లేక ధ్రువమూర్తి గురించి తెలుసుకుందాం.

శ్రీవారి పంచమూర్తులు అంటే ఏమిటి ?
శ్రీవారి పంచమూర్తులు అంటే ఏమిటి ?

మూలమూర్తి లేక ధ్రువమూర్తి: స్వామివారు స్వయంభువు. స్వామి వారు తన దివ్యలోకము నుండి దిగివచ్చి స్వయంగా వెలసిన మూర్తి, స్వామివారు ఎనిమిది అడుగుల ఎత్తుకలిగి చతుర్భుజుడై వెలశాడు. స్వామివారి దక్షిణ వక్షస్థలమున శ్రీదేవి కొలువైవుంది. స్వామివారి చతుర్భుజములలో, రెండు ఊర్ధ్వ బాహువులందు శంఖచక్రములను అమర్చటం జరిగింది. అధోహస్తములలో దక్షిణ హస్తము కటిఅవలంబిత భంగిమలోను ఉంటాయి. భక్తులు అడిగిన కోరికలను యథేచ్చగా ఇచ్చే వరదహస్తుడు స్వామి వామహస్తమునందలి బొటన వ్రేలు తుంటి భాగమునకు, ఊరుపుకు తగిలివుంటుంది. వక్షస్ధల మధ్యన కౌస్తుభము ఒకటి వ్రేలాడుతూ వుంటుంది. స్వామి వారికి ఒక నాగాభరణము కూడావుంది. ఈ నాగాభరణము విగ్రహత మైనదికాదనీ, భక్తులెవరో సమర్పించిన కానుక అని భావిస్తారు.

Share this post with your friends