
తిరుమల శ్రీవారికి వార క్రమానుసారం అర్పించే ప్రసాదాలు అంటే స్వామివారి లడ్డు, దద్దోజనం, పులిహోర వంటి వాటి గురించి మాత్రమే మనకు తెలుసు. ప్రత్యేక ప్రసాదాలు ఏంటనేది చాలా మందికి తెలియదు. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఒక్క మంగళవారం మినహా వారానికొక ప్రసాదాన్ని సమర్పిస్తారు. మరి అవేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోమవారం:
51 పెద్ద దోశలు
51 చిన్న దోశలు
51 పెద్ద అప్పాలు
102 చిన్న అప్పాలు
మంగళవారం:
ప్రత్యేక ప్రసాదాలు ఏవీ ఉండవు
బుధవారం
పెసరపప్పు
పానకం
పాయసం
గురువారం
తిరుప్పావడ సేవ
484 కిలోల పులిహార
51 తేనె తోళీలు
51 పెద్ద జిలేబీలు
వడలు
పాయసం
శుక్రవారం
అభిషేకం
51 పోళీలు
పాయసం
శనివారం
రోజువారీ నైవేద్యాలు మాత్రమే
ఆదివారం
అమృత కలశం లేదా గరుడ ప్రసాదం
ఆదివారం రోజున సమర్పించే ప్రసాదం పేరు అమృతకలశం లేదా గరుడప్రసాదం. ఈ ప్రసాదం వెనుక గల ఐతిహ్యం ఏమిటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతివైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే, గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి, సంతానప్రాప్తి కలిగిస్తాడు.
