మన దేశంలో ప్రఖ్యాతిగాంచిన నాగదేవతాలయాలు ఏవంటే..

మనదేశంలో ప్రఖ్యాతిగాంచిన నాగదేవతాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో రెండు దేవాలయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కేరళలోని హరిపాడు అటవీ ప్రాంతంలో ఓ నాగదేవత ఆలయం ఉంది. దీనిని మన్నరసాల శ్రీ నాగరాజ దేవాలయంగా భక్తులు పిలుస్తారు. ఇది దేశంలోనే ప్రసిద్ధి గాంచిన నాగదేవతాలయం. ఇక్కడ ఒక నాగదేవత విగ్రహం మాత్రమే ఉండదు. 30 వేలకు పైనే జంట నాగుల ప్రతిమలు ఉన్నాయి. ఇక ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయ పూజారిగా ఓ మహిళ ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు చేస్తే చాలు.. కాలసర్పదోషాలు తొలగిపోతాయట.

అంతేకాకుండా పిల్లల కోసం తపించే దంపతులు నాగ పంచమి రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఇక మరో ఆలయం గురించి కూడా చెప్పుకుందాం. ఇది మధ్యప్రదేశ్‌లోని పద్మశేష్ పచ్మరిలో శ్రీ నాగద్వార్ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున నాగులు నివసించేవట. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు సర్పాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మికంగానూ పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ నాగ పంచమి రోజున మాత్రమే కాదు.. కొన్ని ముఖ్యమైన పండుగల సమయంలోనూ పూజలు చేస్తారు. ఇక్కడ పూజ చేస్తే జాతకంలో ఎలాంటి నాగదోషం ఉన్నా తొలగిపోతుందట.

Share this post with your friends