మకర సంక్రాంతి నాడు చేసే దానం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే..

కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడి పయనాన్ని మకర సంక్రాంతిగా పిలవడం జరుగుతోంది. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కొన్ని చోట్ల కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగ తరువాతే ఏదైనా. ఇక ఈ పండుగ నాడు దానం చేసినా కూడా చాలా మంచిదేనట. అయితే ఈ పండుగ నాడు చేసే దానాలు చాలా మంచివట. మనకు పుణ్యాన్నివ్వకుండా జాతకంలో బలహీనతను పోగొడుతాయట. ఏ ఏ రాశుల వారు ఏ ఏ దానాలు చేయాలో తెలుసుకుందాం.

మేషరాశివారు సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం దానం చేస్తే పుణ్యంతో పాటు జాతకంలో బలహీన గ్రహాల స్థానం బలపడుతుంది. వృషభరాశి వారు సైతం నువ్వుల లడ్డూలను దానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభించి జీవితంలో సంతోషంగా జీవిస్తారు. మిథున రాశి, కన్యారాశి వారు మూంగ్ దాల్ కిచిడీని దానం చేస్తే ఒత్తిడి, సమస్యలు దూరమై శ్రేయస్సు పొందుతారట. కర్కాటక రాశివారు బియ్యం లేదా నువ్వులను దానం చేస్తే సమస్యలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందట. సింహ రాశి వారు ఈ రోజు నువ్వులు, బెల్లం దానం చేస్తే అశుభాలు తొలగి కెరీర్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. తులారాశివారు సంక్రాంతి నాడు అన్నదానం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు బెల్లం దానం చేస్తే జీవితంలో ఆనందం ఉంటుంది. ధనుస్సు రాశి వారు నువ్వుల లడ్డూలను.. మకరరాశి వారు అన్నదానం, కుంభ రాశి వారు నువ్వుల నూనె, మీనరాశి వారు కుంకుమ దానం చేస్తే విశేష ఫలితాలుంటాయి.

Share this post with your friends