అఖారాలు అంటే ఏమిటి? ఏ అఖారా ఏ శాఖకు చెందినది?

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వచ్చే నెలలో జరగనుంది. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ సమయంలో మనకు సాధారణ దినాల్లో కనిపించని అఖారాలు కనిపిస్తారన్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా కుంభమేళాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలలో అఖారాలు కీలక పాత్ర పోషిస్తారు. అసలు అఖారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. అఖారాలు 13 రకాలని ముందుగానే చెప్పుకున్నాం కదా. రుషులు, సాధువులంతా అఖారాలకు చెందినవారే. వారంతా వచ్చి పవిత్ర నదిలో స్నానమాచరిస్తారు. సాధువుల సమూహాన్ని అఖారాలని అంటారు.

సాధారణంగా అఖారా అనే పదాన్ని మల్లయోధులు తాము కుస్తీ చేసే ప్రదేశానికి ఉపయోగిస్తారు. అలాంటి అఖారా పేరును మహా కుంభమేళా లేదా కుంభ మేళాలో పాల్గొనే సాధువుల బృందానికి ఆదిశంకరాచార్య పెట్టారని ప్రతీతి. అఖారాలు ఆధ్యాత్మిక , హిందూ సనాతన ధర్మం, సాంస్కృతిక రక్షకులు అని చెబుతారు. దేశవ్యాప్తంగా ఈ అఖారాల సంఖ్య ప్రధానంగా 13 అని ముందుగానే చెప్పుకున్నాం కదా. ఈ 13 రకాల అఖారాలు శైవ, వైష్ణవ, ఉదాసిన్ శాఖల సన్యాసులకు చెందినవి. ఈ 13 అఖారాలలో 7 శైవ సన్యాసి శాఖకు చెందినవి కాగా.. బైరాగి వైష్ణవ శాఖలో 3 అఖారాలు.. ఉదాసిన్ వర్గానికి కూడా 3 అఖారాలు ఉన్నాయి. ఈ అఖారాలకు శతాబ్దాల చరిత్ర ఉంది.

Share this post with your friends