శ్రీరాముడి విజయానికి ఆదిత్య హృదయమే కారణమా?

రామ-రావణ యుద్ధానికి ముందు శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి ప్రభోదించాడని చెబుతారు. ఆ తరువాత శ్రీరాముడు యుద్ధానికి వెళ్లి విజయం సాధించాడట. దీంతో శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించేందుకు ఆదిత్య హృదయమే కారణమని చెబుతారు. వాస్తవానికి అది ఎంతవరకు నిజమనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తవానికి అగస్త్య మహర్షి.. శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించాడని చెబుతారు. దీనికి కారణం లేకపోలేదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు కరుణాసముద్రుడని చెబుతారు.

శ్రీరాముడి విజయానికి ఆదిత్య హృదయమే కారణమా?
శ్రీరాముడి విజయానికి ఆదిత్య హృదయమే కారణమా?

అలాంటి శ్రీరామచంద్రుడు.. రావణుడితో యుద్ధం చేసి ఆయన సైన్యాన్ని, అస్త్ర శస్త్రాలను అన్నింటినీ తునాతునకలు చేశాడట. ఆ తరువాత రావణాసురుడిని ఒంటరిని చేశాడని చెబుతారు. అప్పుడు కరుణతో రావణుడితో శ్రీరాముడు.. అక్కడి నుంచి వెళ్లిపోయి మంచి సైన్యంతో.. మంచి అస్త్రశస్త్రాలతో.. అలాగే మంచి ముహూర్తం చూసుకుని రావాలని పంపించేశాడట. దీంతో దుష్ట శిక్షణ ఆలస్యమైందట. దీంతో అవతారం దాల్చిన కారణం ఆలస్యమవుతోందని అగస్త్యుడు భావించాడట. అప్పుడు శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించి తద్వారా కర్తవ్య బోధ చేశాడని చెబుతారు. కరుణను పక్కనబెట్టి దుష్ట సంహారం గావించాలని సూచించాడట. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడికి రావణ సంహారం గావించేంత శక్తి లేకపోవడం వల్ల ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు బోధించలేదని పురాణాలు చెబుతున్నాయి.

Share this post with your friends